గాంధారి : పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా గాంధారి ( Gandhari ) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం విహారయాత్రకు ( Excursion) బయలుదేరారు. ఈ యాత్రలో భాగంగా విద్యార్థులు డిచ్పల్లి ఖిల్లా రామాలయం ( Ramalayam ) తోపాటు, సారంగాపూర్ హనుమాన్ ఆలయం, బాసర సరస్వతి ( Basara Saraswati) దేవాలయాన్ని సందర్శించారు.
అనంతరం గుత్ప ఎత్తిపోతల పథకాన్ని ( Lift Irrigation ) విద్యార్థులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పురాతన ఆలయాలు, వాటి విశిష్టతలు , తదితర విషయాలపై విహారయాత్రల ద్వారా అవగాహన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి, శంకర్ గౌడ్, శరణ్య, సంగీత, నాగలక్ష్మి, సాయిలు, శ్రీనివాస్ తో పాటు, విద్యార్థులు పాల్గొన్నారు.