మోర్తాడ్, ఫిబ్రవరి 16: వేసవికి ముందే ఎండలు మండతుండడంతో తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉండడంతో యాసంగి పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నది. చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పైప్లైన్ లీకేజీల మరమ్మతులపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లోని చెరువులు ఎండుముఖం పడుతున్నాయి.
దీంతో రెండు మండలాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్లు పగిలిన 15 నుంచి 20 రోజుల వరకు మరమ్మతులు చేపట్టడంలో కాంట్రాక్టర్లు ఎటువంటి చొరవా చూపడంలేదు. ఈ విషయమై రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే, తీరిగ్గా మరమ్మతులు ప్రారంభిస్తున్నారు. లీకేజీలు ఏర్పడిన ప్రతిసారీ ఇలా ఆలస్యంగా మరమ్మతులు చేపట్టడంపై రైతులు మండిపడుతున్నారు.
మోర్తాడ్ శివారులో ఇటీవల పైప్లైన్కు భారీ లీకేజీ ఏర్పడింది. లీకేజీ ఏర్పడి 15రోజులు దాటినా పట్టించుకునే నాథుడే లేడు. ఈ పైప్లైన్ ద్వారా కమ్మర్పల్లి, మోర్తాడ్ శివారులోని చెరువులోకి నీరు రావాల్సి ఉండగా, పదిహేను రోజుల నుంచి నీళ్లు రావడంలేదు. దీంతో ప్రస్తుతం మోర్తాడ్ శివారులోని చెరువు, కమ్మర్పల్లిలోని గుండ్లకుంట చెరువులు ఎండుముఖం పట్టాయి. ఎక్కడ లీకేజీ ఏర్పడినా మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది.
చెరువులు ఎండిపోతుండడం, బోరుబావుల్లో నీళ్లు తగ్గిపోవడంతో రైతులు పంటలకు సరిగ్గా నీరందించలేకపోతున్నారు. పైప్లైన్ మరమ్మతులను చేపట్టడంలో అలసత్వం వీడి త్వరగా పూర్తిచేసి చెరువులను నింపాలని రైతులు కోరుతున్నారు. పైప్లైన్ మరమ్మతులు చేపట్టడంలో జాప్యంపై ఏఈని వివరణ కోరగా వెంటది వెంట మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్, అధికారుల మధ్య ఎటువంటి సాన్నిహిత్యం ఉందో స్పష్టమవుతున్నదని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.