నవరాత్రులు ప్రత్యేక పూజలందుకున్న దుర్గమ్మ.. గురువారం గంగమ్మ ఒడికి చేరింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన దేవీ శోభాయాత్రలు సందడిగా సాగాయి. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. తొమ్మిది రోజులపాటు భక్తితో కొలిచిన ప్రజలు.. దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. దేవీమాత విగ్రహాలను చెరువులు, గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.
నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత శోభాయాత్ర ఉమ్మడి నిజామామాద్ జిల్లాలో గురువారం శోభాయమానంగా కొనసాగింది. పలు మండలాల్లో నిర్వహించిన శోభాయాత్రలో వందల మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తులు భజనలు చేస్తూ అలరించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దుర్గామాత విగ్రహాలను చెరువులు, గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.