Nizamabad | వినాయక్ నగర్, జులై 3 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్నట్టుగా సమాచారం అందడంతో ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం దాడులు నిర్వహించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నగరంలోని పూలాంగ్ చౌరస్తా, బోధన్ బస్టాండ్ ఏరియాలో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ దాడుల్లో ఇందు గంజాయి విక్రయిస్తున్న షేక్ సమీర్, మమ్మద్ రిజ్వాన్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి గ్రా.200ల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్ లు సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసే రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడులలో ఎస్సై రామ్ కుమార్తో పాటు సిబ్బంది భూమన్న, విట్టల్, లక్ష్మీ నర్సయ్య ,శివకుమార్, సాయికుమార్, శ్యాంసుందర్, ప్రకాష్ పాల్గొన్నట్లు తెలిపారు.