Enforcement Raids | భీమ్‌గల్, జూన్ 12: భీమ్‌గల్ మండలంలోని సంతోష్‌నగర్ తండా సమీపంలో ఎక్సైజ్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం దాడులు నిర్వహించి గంజాయి ని పట్టుకుంది. భీమ్‌గల్ కు చెందిన షేక్ మజాస్ గంజాయి తరలిస్తూ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి పట్టుబడ్డాడు. ఇతడి వద్ద నుండి గ్రా.100 ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో గంజాయి సేవించే ముగ్గురు వ్యక్తులకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే గంజాయి దుష్ప్రభావాల గురించి స్థానిక ఎక్సైజ్ సీఐ పీ వేణుమాధవ్ రావు అవగాహన కల్పించారు. అనంతరం వారిని స్థానిక తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.