పట్టణంలో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. కుల, యువజన సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
రాత్రి సమయాల్లో మండపాల వద్ద సాంస్కృతిక, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గణనాథులను తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్