గాంధారి : జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి సాధించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ చంద్రసిర్వి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో గాంధారి పాఠశాలకు చెందిన ఆర్ రోహిత్, కే కార్తీక్ అనే విద్యార్థులు మొదటి బహుమతి గెలుచుకున్నారు.
జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు ప్రశంస పత్రాలతో పాటు, 7000 రూపాయల నగదు బహుమతిని అందజేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో మొదటి బహుమతి సాధించిన పాఠశాల విద్యార్థులను బుధవారం ప్రిన్సిపల్ సురేష్ చంద్ర సిర్వి, వైస్ ప్రిన్సిపల్ సవితతోపాటు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.