వినాయక నగర్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రెండు రోజుల క్రితం నాలుగేళ్ల చిన్నారి (Child missing ) అదృష్టమైందని రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి ( SI Sai reddy) వెల్లడించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన మహేందర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య నలుగురు పిల్లలతో కలిసి నాందేడ్ ( Nanded ) వెళ్లేందుకు ఈనెల 13వ తేదీ సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
నాందేడ్ వెళ్లేందుకు దేవగిరి ఎక్స్ప్రెస్ ( Devagiri Express) ట్రైన్ లో ఎక్కిన మహేందర్ సింగ్ కొంత సేపటి తరువాత తన కూతురు సోనమ్ కౌర్ (4) తమతో పాటు లేదని గుర్తించాడు. వెంటనే రైలు మొత్తం వెతికినా పాప జాడ తెలియలేదు. తండ్రి రైల్వే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఎవరికైనా చిన్నారి కనిపిస్తే యం రవి కుమార్ , ఎస్హెచ్వో , రైల్వే పోలీస్ స్టేషన్, నిజామాబాద్. 87126-58591 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.