హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జడ్పీ మాజీ చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.

బీఆర్ఎస్ 25 ఏండ్లు పూర్తిచేసుకొని 26 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరికీ కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.


