నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27 : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశాయి. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా 2001లో పురుడుపోసుకున్న బీఆర్ఎస్ పార్టీ పాతికేండ్ల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నదని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి 60 ఏండ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి కొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు.