KR Suresh Reddy | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేఆర్ సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు జగత్ రెడ్డి మాట్లాడుతూ సురేష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని, నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి, అలాగే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్రజాసేవలో ముందుంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు షాహిద్ అలీ మాట్లాడుతూ మాజీ ఎంపీ సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ రాష్ట్ర సమస్యలపై నిరంతరం పోరాడారని కొనియాడారు.
రాజ్యసభలో రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అన్యాయాలపై ప్రశ్నించడం, మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల సమస్యలను ప్రస్తావించడం, నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల సమస్యలను పలుమార్లు పార్లమెంట్లో లేవనెత్తడం, రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐలు, అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వంటి విషయాల్లో ఆయన ప్రత్యేకంగా కృషి చేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు మోహన్ నాయక్ మాట్లాడుతూ సురేష్ రెడ్డి వంటి ప్రజాసేవకు అంకితమైన నాయకులు రాజకీయాల్లో కొనసాగి మరిన్ని ఉన్నత స్థాయి పదవులు పొందాలని ఆకాంక్షించారు.
ఆయన ప్రజలకు చేసిన సేవలు మరచిపోలేనివని, భవిష్యత్‌లో కూడా ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టెలికాం డైరెక్టర్ తాజుద్దీన్, పరిభన్, రవికిరణ్, దీపక్, అంజీ, ఖాలిద్, అబ్రార్, ఇర్షాద్, జుబేర్, తిమ్ము తదితరులు పాల్గొన్నారు. యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సురేష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.