లింగంపేట్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ ( Janardhan Goud ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR) ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ పట్టణంలోని కేటీఆర్ నివాసంలో కలిసి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. నియోజకవర్గంలో (Constituency ) పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు కేటీఆర్ సూచించారు. నియోజకవర్గ నాయకులకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆయన వెంట కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యం రావు, నాగిరెడ్డిపేట మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.