కామారెడ్డి: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు జనార్దన్ గౌడ్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారన్నారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, గాంధారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సర్వాపురం సత్యంరావు, నాగిరెడ్డిపేట్ మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అశోక్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను కలిసినవారిలో ఉన్నారు.