ఖలీల్‌వాడి, నవంబర్ 20 : నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ భర్త శేఖర్‌పై జరిగిన దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మేయర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. రెండ్రోజుల క్రితం దాడికి గురైన శేఖర్ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన కవిత.. మేయర్‌కు బుధవారం ఫోన్ చేసి పరామర్శించారు. అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. శేఖర్ త్వరగా కోలుకోవా లని ఆకాంక్షించారు.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్‌ను మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ బుధవారం వేర్వేరుగా పరామర్శించారు. దవాఖానకు వచ్చిన బాజిరెడ్డి.. శేఖర్‌ను పరామర్శించి, మేయర్‌కు ధైర్యం చెప్పారు. జీవన్‌రెడ్డి కూడా దవాఖానకు చేరుకుని శేఖర్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉన్నామని నీతూకిరణ్కు భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ కూడా శేఖర్‌ను పరామర్శించారు.