ఎల్లారెడ్డి, మార్చి 31: లింగంపేట్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు మండలంలోని లింగంపల్లి ఖుర్దు గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు పలువురు రైతులతో మాట్లాడారు.
నాకు రెండెకరాల పొలం ఉంది పొలం ఎందుకు ఎండిపోయింది? లో వోల్టోజీతో మోటారు కాలిపోయింది. నీళ్లందక పొలం ఎండిపోయింది. మోటారు కాలిపోతే ఎంత ఖర్చు అయితది. మోటరు రిపేర్‌కు నాలుగు వేలరూపాయల దాక అయితది. ఇప్పటికి ఎన్నిసార్లు మోటరు రిపేర్ చేపిచ్చినవ్? మూడు సార్లు రిపేర్ చేపిచ్చిన.. 12వేల దాక ఖర్చయింది. మరి పంట ఏమన్న చేతికచ్చేటట్టుందా? యాడ సార్…. పొట్టకొచ్చిన పొలం నీళ్లందక మొత్తం ఎండిపాయే… ఇంతకు ముందు పొలాల పరిస్థితి ఎట్లుంటుండె, ఇప్పుడెట్లుంది…. అప్పుడు శాన మంచిగుండె…. గింత తక్లీబు కాలే…. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక రైతుల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నమైంది.
మహిళా రైతు: బిగెడున్నర ఉంది సారు ఏంది పరిస్థితి? పొట్టదశ కొచ్చినంక ఎండిపోయింది.. మా పరిస్థితి మంచిగ లేదు సారు…. మమ్మల్ని ఆదుకోవాలె… మొత్తం ఎండిపోయిందా.. ఏమన్నా చేతికస్తదా.. మొత్తం ఎండిపోయింది సారు…. పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది.