పిట్లం/ నిజాంసాగర్, జూలై 2: ఓటరు జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఓటరు జాబితా నుంచి అర్హులను తొలగించకుండా చూడాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. గురువారం ఆయన పిట్లం మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, నాయకులు, బీఎల్ఏలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి ఓటరు గణనపై సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమం అమలు విధానం, ఓటరు నమోదు ప్రక్రియపై బీఎల్ఏలకు పలు సూచనలు చేస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ..అర్హులైన ఒక్క ఓటరు కూడా జబితా నుంచి మినహాయించబడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చా రు. పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.
‘సర్’పై తహసీల్దార్లతో షిండే సమాశం
మద్నూర్, జుక్కల్ మండలాల తహసీల్దార్లతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ గురించి అడిగి తెల్సుకున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి కక్షసాధింపు చర్యలు తావివ్వకుండా అధికారులు బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు.