HomeNizamabadFormer Cm Kcrs Birthday Was Celebrated Grandly In Bansuwada
KCR Birthday | బాన్సువాడలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
KCR Birthday | తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బాన్సువాడ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జన్మదిన వేడుకలను (KCR Birthday ) బాన్సువాడ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కే సీఆర్, మాజీ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Goverdhan) జన్మదినం సందర్భంగా కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుభేర్(Shaik Jubair) మాట్లాడుతూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించారని తెలిపారు. ప్రాంత అభివృద్ధి, అన్నివర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.\ తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబోవు రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు.
భగవంతుడి ఆశీర్వాదం తో నిండు నూరేళ్లు చల్లగా, ఆయురోగ్యాలతో ఉండాలని అనా్నరు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమం లో మొక్కలు నాటి, పంపిణీ చేశారు. బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోచి గణేష్, సాయిబాబా, రమేష్ యాదవ్, గాండ్ల కృష్ణ, సంజయ్, చాకలి సాయిలు, శ్రీను, ఆనంద్ గౌడ్,ఆప్రొజు, సమీర్, గోపి, మాజీ ఎంపీటీసీ సయ్యద్ ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు.