నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయ ఉత్సవాలు బుధవారంతో సంపూర్ణమయ్యాయి. చివరిరోజు కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సాయంత్రం ఉత్తరపూజ అనంతరం వేద మంత్రాలతో సిర్నాపల్లి గడిలో ఉంచి జెండాకు పూజలు చేశారు. అక్కడి నుంచి పూలాంగ్ వరకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి వాగు పక్కన ఏర్పాటుచేసిన ప్రత్యేక స్థలంలో జెండాను ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
-సుభాష్‌నగర్, సెప్టెంబర్ 18