Nizamabad Police | వినాయక్ నగర్, జూన్ 25: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షణలో షీ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగి ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాలతోపాటు బస్టాండ్, కళాశాలలు, పాఠశాలల వద్ద కాకూడదు మహిళలు, యువతులు, విద్యార్థినిలను వేధించే ఆకతాయిలా పని పట్టేందుకు కార్యచరణ నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఎస్ఐ పర్యవేక్షణలో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మహిళా సిబ్బందితో షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ పరిధిలోగల ఓ ప్రైవేట్ కళాశాల వద్ద విద్యార్థినులను చూస్తూ, నవ్వుతూ వెకిలి చేష్టలు చేసిన ఇద్దరు ఆకతాయిలను స్వీట్ డ్రీమ్స్ బృందం పట్టుకుంది. అనంతరం ఈ ఆకతాయిల పై తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత రూరల్ పోలీసులకు అప్పగించారు.
అలాగే నగరంలోని సుభాష్ నగర్ లో గల ఓ ప్రైవేట్ గర్ల్స్ హై స్కూల్ వద్ద విద్యార్థులను సైతం వెకిలి చేష్టలు చేసిన మరో ముగ్గురు ఆకతాయిలను షీ టీమ్ బృందం పట్టుకుంది. అనంతరం వారిపై చర్యల నిమిత్తం ముగ్గురు ఆకతాయిలను సంబంధిత మూడో టౌన్ పోలీసులకు అప్పగించారు. ఆకతాయిలు, పోకిరీలు మహిళలు ,యువతులు విద్యార్థినుల పట్ల వెక్కిరి చేష్టలు చేసిన, వారిని వేధింపులకు గురిచేసిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.