కంఠేశ్వర్/ కామారెడ్డి, డిసెంబర్ 15 : ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తనిఖీ చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు మొత్తం19,855 మంది అభ్యర్థులకు 9,070 మంది హాజరుకాగా.. 10,785 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు మొత్తం 19,855 మంది అభ్యర్థులకు 9,020 మంది హాజరుకాగా..10,835 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం నాలుగు సెషన్లలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలోని 19 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించినట్లు రీజనల్ కో-ఆర్డినేటర్ విజయ్ కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 8,085 మంది అభ్యర్థులకు 3,971 మంది హాజరు కాగా 4,114 మంది గైర్హారాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షకు 50.88 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 8,085 మంది అభ్యర్థులకు 3,917 మంది హాజరు కాగా 4,168 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షకు 51.55 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు.