ఆర్మూర్ టౌన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి పక్కన ఉన్న 4 షట్టర్లకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.