Fire accident | నిజామాబాద్‌లో విద్యుత్ షార్ట్‌సర్య్కూట్‌తో అగ్ని ప్రమాదం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్ ప్రాంతంలోనీ ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లోని లోపలి గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగి గదిలోని వస్తువులకు మంటలు అంటుకోవడంతో దాన్ని గమనించి ఇంటి యజమాని మహమ్మద్ అబ్దుల్ ఖాన్ మంటలు ఆర్పేందుకు గదిలోకి వెళ్లారు.
- లోపలి గదిలో ఉన్న తండ్రిని బయటికి తెచ్చేందుకు వెళ్లి గాయాల పాలైన కుమారుడు
Fire accident | వినాయక్ నగర్, సెప్టెంబర్ 28 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్ ప్రాంతంలోనీ ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లోని లోపలి గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగి గదిలోని వస్తువులకు మంటలు అంటుకోవడంతో దాన్ని గమనించి ఇంటి యజమాని మహమ్మద్ అబ్దుల్ ఖాన్ మంటలు ఆర్పేందుకు గదిలోకి వెళ్లారు. గదిలోకి వెళ్లిన ఆయన కాళ్లకు మంటలు అంటుకోవడంతో అది గమనించి ఆయన కుమారుడు మొహమ్మద్ అబ్దుల్ సాదుల్ మంటలు వ్యాపించిన గదిలోకి వెళ్లాడు.
దీంతో భారీగా చెలరేగిన మంటల్లో తండ్రి కొడుకులు ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంట్లోంచి భారీగా మంటలతో కూడిన దట్టమైన పొగలు బయటకు రావడానికి గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లోని గదిలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. నాలుగో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదం జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. మంటల్లో తీవ్ర భగాయాల పాలైన తండ్రి కొడుకులను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై అగ్నిమాపక, పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

