కామారెడ్డి : కామారెడ్డి (Kamareddy) పట్టణములోని స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, ఓల్డ్ ఎన్‌హెచ్ 7 పై ఇష్టరాజ్యంగా వాహనాలను పార్కింగ్ (Parking) చేసిన వాహన యజమానులకు పోలీసులు జరిమానా(Fine) విధించారు. గత వారం రోజులుగా జిల్లా ఎస్పీ కామారెడ్డి ఆదేశాలతో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో పట్టణంలో రోడ్లపై ఉన్న 24 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా 16 ద్విచక్రవాహనాలు, 8 కార్లకు చలాన్ విధించారు.
రోడ్లపై వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని ఏఎస్పీ సూచించారు. ట్రాఫిక్ రూల్స్‌కు (Traffic Rules ) విరుద్ధంగా వాహనాలను నిలిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై దుకాణాలకు సంబందించిన బోర్డ్స్ పెట్టిన యజమానులకు , చిరు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై మహేశ్ తదితరులు పాల్గొన్నారు.