పోతంగల్ : నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామనికి చెందిన బీజేపీ కార్యకర్త గంగారం కుమారుడు సాయిరాం రెండురోజుల క్రితం మరణించాడు. విషయం తెలుసుకున్న బీజేపీ( BJP ) నాయకులు కోనేరు శశాంక్ బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని (Financial assistance) స్థానిక నాయకుల చేత అందించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ పటేల్, బజరంగ్ హన్మండ్లు, సుదం అశోక్, మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.