పెద్ద కొడప్గల్ : ఆపదలో ఉన్న మిత్రుడు కుటుంబానికి ఆర్థిక చేయుతను (Financial assistance) అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు తోటి మిత్రులు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ ( Peddakodapgal ) మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రకాష్‌కు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు, కాలు విరగడంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. అతని కుటుంబ పరిస్థితిని చూసి 2006 బ్యాచ్ ఎల్లారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు, సీనియర్ మిత్రులు,ఉపాధ్యాయులు చలించారు. వాట్సప్ వేదికగా చేసుకొని రూ . 9వేలను ప్రకాష్‌కు అందజేశారు.