Entrance Exam | పెద్ద కొడప్గల్, ఫిబ్రవరి 22 : పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించామని, ఈ పరీక్ష ప్రశాంత ముగిసిందని పాఠశాల ప్రిన్సిపాల్ సునీత తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు మొత్తం 480 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 446 మంది హాజరయ్యారు. 34 మంది గైర్హాజరైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సునీత తెలిపారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టామని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు.