రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు.. ఆయన పాలనలో డైవర్షన్ రాజకీయాలకే ప్రాధాన్యం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు అని, ఆయన పాలన అంతా డైవర్షన్ రాజకీయాలతోనే నడుస్తున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.
- కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకుంటే నిధులివ్వకపోవడం దుర్మార్గం
- మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు అని, ఆయన పాలన అంతా డైవర్షన్ రాజకీయాలతోనే నడుస్తున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకుంటే నియోజకవర్గానికి నిధులివ్వకపోవడం సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని, రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని పేరొన్నారు. నిధుల కొరతపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రేవంత్ పాలనను తప్పుబడుతున్నారని, మిషన్ భగీరథను నిర్వీర్యం చేసి సింగూరును ఎండబెట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే దకుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సంగారెడ్డి పర్యటనలో సీఎం మాటలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజాధనంతో సభలు ఏర్పాటుచేసి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై వ్యక్తిగత విమర్శలు చేయడం శోచనీయమని ధ్వజమెత్తారు. కేసీఆర్ అపర భగీరథుడిలా ఇంటింటికీ తాగునీరు అందిస్తే, రేవంత్ పాలనలో బూతులు మాట్లాడటం తప్ప, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రేషన్ కార్డులపై ఫొటోలు వేసుకోవడం, సన్నబియ్యంపై గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని, కేసీఆరే సన్నబియ్యం పంపిణీకి బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు.
వ్యవసాయానికి 12 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని స్వయంగా అధికారులే చెప్తున్నారని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ అమలు కాకపోగా యూరియా యాప్‌తో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువవికాసం ఇస్తామని సీఎం మోసం చేశారని ధ్వజమెత్తారు. సిగాచి బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వలేదని, కల్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేస్తున్నారని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. మహిళకు చీరలు పంపిణీ చేశామని, చీరలు కట్టుకొని వచ్చినవారు నిలబడాలని రేవంత్ కోరడం మహిళలను అవమానించడమేనని సునీతాలక్ష్మారెడి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డివి రాతియుగపు ఆలోచనలు : ఎమ్మెల్యే మాణిక్‌రావు
ఏఐ యుగంలోనూ రేవంత్‌రెడ్డి రాతియుగం నాటి ఆలోచనలతో మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మాణిక్‌రావు మండిపడ్డారు. హరీశ్‌రావు ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే ఓర్వలేకనే ఆయనపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మాటలు జోకర్‌ను తలపిస్తున్నాయని, దీంతో ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం సంగారెడ్డి ప్రజలను అవమానించారు : ఎమ్మెల్యే చింతా
సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఇవ్వకుండా సంగారెడ్డి ప్రజలను అవమానించారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టు చేయించి సీఎం బజారు భాష మాట్లాడారని మండిపడ్డారు. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పకన పెట్టుకుని ఎన్నికల ప్రచారం తరహాలో మాట్లాడారని, సంగారెడ్డి గడ్డపై అడుగుపెట్టే హకు సీఎంకు లేదని ధ్వజమెత్తారు.
డైవర్షన్ రాజకీయాలు ఆపాలి: క్రాంతికిరణ్
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి క్షుద్రపూజల నాటకానికి తెరలేపారని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హరీశ్‌రావు వెళ్లిన ఆలయాలకే రేవంత్‌రెడ్డి కూడా వెళ్లారని, ఆయన ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరువును ఎలా ఎదురోవాలో ఆలోచించకుండా, ప్రతిపక్షాలపై పిచ్చి ఆరోపణలు చేస్తూ రేవంత్‌రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని క్రాంతికిరణ్ మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

