డిచ్పల్లి, జనవరి 22 : మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బుధవారం తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కానీ పక్షంలో కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవ్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పినా, తమకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు.
ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు, భవనాల అద్దె కూడా చెల్లించడంలేదన్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మారయ్యగౌడ్, శంకర్, నరాల సుధాకర్, జైపాల్ రెడ్డి, బాలాజీ, గిరి, శ్రీనివాస్, సుజన్ రెడ్డి, మలేహ, దుష్యంత్, రమణ, శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, నవీన్, హరికృష్ణ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.