Bhanswada | బాన్సువాడ, ఆగస్టు 21 : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వ, ప్రవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని సూచించారు.
విద్యార్థుల కు ప్రభుత్వం విడుదల చేయాల్సిన రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్లోల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, పైడిమల్ లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, కౌన్సిలర్లు మహేష్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్, సాయిరెడ్డి, మొహను రెడ్డి, విశాల్, గంగాధర్, చిరంజీవి, రమేష్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.