ధర్పల్ల్లి, మార్చి 16 : డబ్బుల విషయంలో జరిగిన గొడవలో తండ్రిని ఓ కొడుకు హతమార్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామంలో చోటు చేసుకున్నది. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హోన్నాజీపేట్కు చెందిన పాలెం నడ్పి మల్ల య్య (65), అతడి కుమారుడు మధు శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో గ్రామంలోని ఓ దుకాణం వద్ద డబ్బుల కోసం గొడవపడ్డారు. స్థానికులు అక్కడికి చేరుకొని సముదాయించారు.
అనంతరం మధు ఇంటికెళ్లి గొడవ జరిగిన విషయం తన తల్లికి చెప్పాడు. సుమారు 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన మల్లయ్యను కుమారుడు మధు, భార్య లక్ష్మి కలిసి ఆయన గొం తు పట్టుకుని బలంగా నెట్టేయడంతో తల నేలకు తగిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. లేవబోతుంటే తలపై కొడుకు బీరు సీసాతో బలంగా బాదడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకొన్నారు.