పిట్లం, మే 31: మండలంలోని పోతిరెడ్డిపల్లి శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందగా, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడి కండ్ల ముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన దుర్గయ్య(62), తన కుమారుడు దుర్గేశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బాన్సువాడ వైపు వెళ్తున్నారు.
పోతిరెడ్డిపల్లి రూంతండా మలుపువద్ద పిట్లం వైపు వస్తున్న ఓ లారీ ఎదురుగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య ఘటనా స్థలంలోనే మృతి చెందగా, దుర్గేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి దుర్గేశ్‌ను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.