వినాయక్ నగర్, మే 25 : నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డు చౌరస్తా వద్దగల ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాకుడి పై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. రెండో టౌన్ ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని రోడ్డు చౌరస్తాలో గల వైన్ షాపు సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వచ్చిన ఇద్దరు యువకులు తమకు కావాలసిన ఫుడ్ ను ఆర్డర్ చేశారు. ఆర్డర్ తయారు చేసే క్రమంలో నిర్వాకుడు విజయ్ ను ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లు ఉల్లిగడ్డలు ఇవ్వాలంటూ బూతు మాటలు తిట్టారు.
అకారణంగా తనను ఎందుకు తిడుతున్నారని నిర్వాకుడు వారిని అడగడంతో ఆర్డర్ ఇచ్చిన యువకులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్న కత్తిని తీసుకొని అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయమైన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అకారణంగా ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడి తో గొడవ పడి అతనిపై దాడికి పాల్పడిన ఘటన విషయంలో బాధితుడి ఫిర్యాదు మేరకు నవనాథ్, దిలీప్ ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచే స్తున్నామని ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ వెల్లడించారు.