పసుపు రైతుల ఆందోళన
పసుపునకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్‌యార్డులో జిల్లా రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు
- కొనుగోళ్లనువేగవంతం చేయాలి
- కేంద్రం మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్
- ఎంపీ అర్వింద్‌పై కర్షకుల ఆగ్రహం
- ‘బోర్డు’ మాట నిలబెట్టుకోవాలన్న రైతులు
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 14: పసుపునకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్‌యార్డులో జిల్లా రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపునకు మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పి, ఇప్పటి వరకు ఆ దిశగా కృషిచేయకపోవడం దారుణమన్నారు. దీంతో జిల్లాలోని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేసి పసుపునకు మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దతు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని వారు కోరారు.
21 వరకు పసుపు పంటను తీసుకురావొద్దు
మార్కెట్ కమిటీ కార్యదర్శి విజయ్‌కిశోర్ మాట్లాడుతూ.. మార్కెట్‌కు పసుపు పంట 25 వేల బస్తాలు వచ్చిందని తెలిపారు. ఈ 17 వరకు విక్రయించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 21వ తేదీ వరకు పంటను తీసుకురావద్దని సూచించారు. పసుపు బాగా ఎండబెట్టిన తర్వాతే తీసుకురావాలన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

