Farmers | ఆర్మూర్ టౌన్ : వర్షాకాలం సీజన్ లో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతుల ఉదయం నుంచి సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. యూరియా రాకపోవడంతో సొసైటీ గోదాం వద్ద సుమారు 200 మంది రైతులు చెట్టులో చెప్పులు ఆకు కొమ్మలు క్యూలో పెట్టి చెవిలో క్యూలో పెట్టి పడిగాపులుగాశారు. 450 బస్తాలతో కూడిన ఒక లారీ లోడు రావడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిగారు.
ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి ఇస్సపల్లికి చేరుకొని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. ఓ వైపు వానలు పడుతుంటే రైతులు మొక్కజొన్న, వరి పనులు మొదలుపెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని, వెంటనే రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.