ఎడపల్లి, అక్టోబర్ 27: మండలంలోని పోచారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. రైతుభరోసా ఎగ్గొట్టిందని మండిపడ్డారు.
సన్నరకాలకు రూ.500 బోనస్ ఇచ్చుడు దేవుడెరుగు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు తాము పండించిన పంటను దళారులను అమ్మి నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కోల సాయిలు, తోట దేవన్న, శంకర్, సుంకరి పోచయ్య, గోపి, బాయికాడి అబ్బయ్య, పోశెట్టి పాల్గొన్నారు.