ఆర్మూర్టౌన్, ఆగస్టు 22: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలుచేయని పక్షంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా యూరియా బుక్ కావడంలేదని తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంటలకు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయడంలేదని, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. తూములు, అలుగులకు మరమ్మతులు చేపట్టాలని, మరికొన్ని చోట్ల తూములు ఏర్పాటు చేయాలని కోరారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు కెనాల్ బ్రిడ్జి వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు.