Asian Games : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పసిడి వేటలో తడబడినా.. వెండి, కాంస్యాలతో మెరుస్తున్నారు. లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్(Murali Sreeshankar) అదరగొడుతూ వెండి సాధించాడు. జావెలిన్ త్రోలో ఏకంగా రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. యశ్వీర్ సింగ్(Yashvir Singh) సిల్వర్, రోహిత్ యాదవ్(Rohit Yadav) కాంస్యం కొల్లగొట్టగా.. బాక్సర్లు సూపర్ పంచ్‌తో మరో మూడు పతకాలు ఖరారు చేశారు. మహిళల విభాగంలో లొవ్లీనా బర్గొహైన్(75 కిలోలు), ప్రియా గంఘాస్, కపిల్ పొఖారియా(90 ప్లస్ కిలోలు)లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. మొత్తంగా.. బాక్సింగ్‌లో ఆరు పతకాలు ఖాయమమ్మాయి.
ఐచీ నగోయ ఆతిథ్యమిస్తున్న 18వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించాడు. పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో గాయపడిన అతడు చివరి రెండు ప్రయత్నాల్లో దూకలేదు. మోకాలి గాయం వేధించడంతో 8.07 మీటర్లతో రెండో స్థానంలో నిలిచిన అతడు.. చివరకు వెండిని అందుకున్నాడు. ఇదే విభాగంలో భారత అథ్లెట్ డేవిడ్ సొలొమాన్ 7.70 మీటర్ల దూరం దూకి ఏడో స్థానంతో నిరాశపరిచాడు.
TRAGIC FALL BUT MURALI SREESHANKAR WALKS AWAY WITH THE SILVER
Watch the video for Murali Sreeshankar’s heartbreaking fall — BUT A TRUE CHAMPION. CONGRATULATIONS CHAMP
8.07m, just 10cm off gold, #SILVERFORINDIA #MURALISREESHANKAR #AsianGames2026 #Athleticsindia #NNISSports…
— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 28, 2026
కాసేపటికే జావెలిన్ త్రోలో భారత అథ్లెట్లు యశ్వీ్ర్ సింగ్, రోహిత్ యాదవ్‌లు అదరగొట్టారు. ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా గైర్హాజరీలో పతక బాధ్యత తీసుకున్న ఈ ఇద్దరూ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రుమేశ్ పతిరంగ(శ్రీలంక) 88.55 మీటర్లతో పసిడి సాధించగా.. యశ్వీర్ చివరి ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.72మీ, రోహిత్ 84.68మీ దూరం ఈటెను విసిరి వరసగా వెండి, కాంస్యాలు ఒడిసిపట్టారు.
𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐝𝐞𝐥𝐢𝐠𝐡𝐭 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚!
India may not have had Neeraj Chopra at the Asian Games, but Yash Vir Singh and Rohit Yadav made up for his absence with a silver and a bronze, respectively in the men’s javelin throw event.
Yash Vir threw 85.72m while Rohit’s best… pic.twitter.com/PA8iB4Kjy6
— Sportstar (@sportstarweb) September 28, 2026
కామన్వెల్త్ క్రీడల్లో తేలిపోయిన బాక్సర్ లొవ్లీనా బొర్గోహైన్ ఆసియాడ్‌లో మెరిసింది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా బాక్సర్‌పై పంచ్‌ల వర్షం కురిపించింది. ఏకపక్ష పోరులో 5-0తో గెలుపొందిన లొవ్లీనా దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. పురుషుల 90 ప్లస్ కిలోల ఫైట్‌లో కపిల్ పొఖారియా ధాటికి దక్షిణ కొరియా బాక్సర్ కిమ్ గిచాయే చేతులెత్తేశాడు.
PODIUM SECURED. 🥊
Lovlina Borgohain storms into the semifinals with a commanding 5-0 win, securing a medal for India in the Women’s 75kg category!
Watch the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/KN66FWSeCx
— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2026
ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కపిల్ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి 5-0తో గెలుపొందాడు. మహిళల విభాగంలో ప్రియా గంఘాస్ సూపర్ పంచ్‌తో సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆదివారం క్వార్టర్స్‌లో ప్రవీణ్, అంకుశ్, నరేందర్‌లు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా.. గత ఎడిషన్‌తో పోల్చితే ఈసారి అదనంగా రెండు అంటే మొత్తంగా ఆరు పతకాలు ఖాయమమ్యాయి.