పోతంగల్ (కోటగిరి,) మే 6 : మంజీరా నది ఇసుక క్వారీ నుండి తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగావ్ గ్రామస్తులు బుధవారం ఆందోళన కు దిగారు. ఇసుక లారీలను అడ్డుకున్నారు.ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొందరు అక్రమార్కులు మంజీర నదిలో ఇసుకను తోడేస్తున్నారని దీంతో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయి రాబోవు రోజుల్లో సాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
వెంటనే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించిన వారు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ఇలా తోడేస్తుంటే రాబోవు రోజుల్లో మంజీరా అంతా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. మరోపక్క మంజీరా సమీపంలో ఎత్తిపోతల పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ ఉందని వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మంజీరాలో ఇసుకను ఇంత లోతుగా తవ్వేస్తుంటే పక్కనే ఉన్న బోర్లని ఎత్తిపోతాయని మండిపడ్డారు.