Banswada | బాన్సువాడ రూరల్, జూన్ 29 : కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, గతంలో పాసు బుక్కు వచ్చి రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ రైతులకు సూచించారు. కోనాపూర్ రైతు వేధికలో రైతు భరోసా దరఖాస్తులను ఆయన సోమవారం రైతుల నుంచి స్వీకరించారు.
రైతు భరోసా పథకానికి జులై 5లోపు ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ఫారం, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్, బ్యాంకు ఖాతా జీరాక్స్ లను రైతువేదికలో అందించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.