విద్యానగర్, జనవరి 7: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. భూములు పోతా యని కొందరు పదే పదే చెబుతూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నార న్నారు. భూములు పోతాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నా రు. ప్రస్తుతం జారీ చేసింది బృహత్ ప్రణాళిక ముసాయిదా మాత్రమేనని చెప్పారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి కలెక్టర్ పాటిల్ విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ప్రస్తుతం డ్రాఫ్ట్ దశలోనే ఉన్నదని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. భూములు పోతాయని ఎందుకు అపోహ పడుతున్నారో తెలియట్లేదని, అదంతా తప్పుడు సమాచారమేనని స్పష్టం చేశారు. మాస్టర్‌ప్లాన్ పై అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు 1,026 అభ్యంతరాలు వచ్చాయని, జనవరి 11 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉందని గుర్తు చేశారు.
గతంలో నిర్ణయించిన మాస్టర్‌ప్లాన్‌తో రైతుల భూములు పోలేదని, ఇప్పుడు కూడా పోవని, రైతులు అనవసరంగా ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. డ్రాప్ట్ దశలోనే ఉన్న మాస్టర్పాన్ను రైతుల అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ పై 60 రోజుల్లో అభ్యంతరాలు తెలుపవచ్చని సూచించారు. డ్రాప్ట్పై అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిశీలన అనంతరం కౌన్సిల్లో చర్చించిన తర్వాతే ఫైనల్ అవు తుందన్నారు. మాస్టర్‌ప్లాన్‌పై ప్లెక్సీల ద్వారా ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. ఇండస్ట్రియల్ జోన్ అంటే భూ సేకరణ కాదన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా మాస్టర్‌ప్లాన్ తయారవుతుందని, రైతులకు అనుమానాలు అవసరం లేదని, అవసరమైతే వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.