Gandhari | సర్వాపూర్‌లో విద్యుత్ కొరతపై రైతుల ఆగ్రహం
గంధారి మండలంలోని సర్వపూర్ గ్రామంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
Gandhari | గాంధారి : గంధారి మండలంలోని సర్వపూర్ గ్రామంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. బాన్సువాడ-గాంధారి రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పంటలకు నీరందించలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికే సాగు కోసం పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి తమను ఆదుకోవాలని అధికారులను కోరారు. సబ్‌స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టడంతో పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు. రైతుల సమస్యలను అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, పంటలు నష్టపోకుండా సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో సర్వపూర్తో పాటు పరిసర గ్రామాలకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

