భిక్కనూరు, జనవరి 8: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యుత్ షాక్ తగిలి దుర్మరణం చెందాడు. భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు కథ నం ప్రకారం..
తిప్పాపూ ర్ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి (61) బుధవా రం ఉద యం తన పొలానికి వెళ్లాడు. మోటర్ ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్టార్టర్ డబ్బాలో ఉన్న వైర్లను ఎలుకలు కట్ చేయడంతో అవి తగిలి మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.