SP Rajesh Chandra | కామారెడ్డి : వివాహేతర సంబంధమే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా చిన్న కొడంగల్ గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్య హైదరాబాద్కు బతుకు దెరువు కోసం వెలి 3 నెలలుగా కులీ పని చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. . అతను ఇంటికి వచ్చినప్పటి నుండి అతడి భార్య సుజాతకు తన ఊరి పంచాయతీ సెక్రటరీ ధారవత్ కృష్ణతో వివాహేతర సంభందం ఉందని గుర్తించి తరుచూ గొడవలు పెట్టేవాడు.
చివరగా భార్య భర్తలు ఇద్దరు కలిసి వారి సంసారం చక్కదిద్దుకునేందుకు కృష్ణ ను చంపివేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఏరనోళ్ల బాలరాజ్, మల్కయ్య ల సహాయంతో పథకం ప్రకారం ఈ నెల5న రాత్రి సుజాత ద్వారా మృతుడు కృష్ణ ను ఇంటికి పిలిపించుకొని నలుగురు కత్తి, గొడ్డలి, ఇనుప రాడ్డు, రొకలితో విచక్షణ రహితంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత కృష్ణ మృత దేహాన్ని అతడి మోటార్ సైకిల్ ను గ్రామ సమీపంలోని రెడ్ది చెరువులో పడేశారు. మృతుడు కృష్ణ తల్లి ధారావత్ మీరాబాయి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేసి, అనుమానితులైన లింగంపేట మల్కయ్య, లింగంపేట సుజాత, ఎర్రనోల్ల బాలయ్య, లింగంపేట మల్కయ్య లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
కాగా వారి నుండి హత్యకు ఉపయోగించిన వస్తువులతో పాటు రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కాగా ఈ కేసును అతి తక్కువ సమయంలో మర్డర్ కేసును ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ శ్రీ విట్టల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్, పిట్లం ఎస్ఐ రాజు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.