బాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గేటు వద్ద మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు 90 కిలోల ఎండు గంజాయిని (Ganja seize ) పట్టుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. బాన్సువాడ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ( Deputy Commissinor Somireddy ) విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుంచి గంజాయిని తీసుకొచ్చి మహారాష్ట్రలోని నాందేడ్ (Nanded) కు తరలిస్తున్న తిరుపతి, సత్నంను అరెస్టు చేసినట్లు వివరించారు. వారి వద్ద ఉన్న స్కార్పియో వాహనంతో పాటు మోటార్ సైకిల్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 22 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వాహనం విలువ రూ. 35లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.