Hanmant Shinde | బిచ్కుంద, జుక్కల్ : ప్రతీ ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉప పీఠం జుక్కల్ మండలంలోని దోస్ పల్లి (బంగారు పల్లి), గ్రామం నుండి జుక్కల్ మండల కేంద్రం మీదుగా సెప్టెంబర్ 27న ప్రారంభమైన పాదయాత్ర న్యానిజ్ ధామ్ వైపు భక్తి పూర్వకంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సోమవారం పాల్గొన్నారు.
న్యానిజ్ ధామ్ వైపు బయలుదేరిన పాయ దీండీలో మార్గమధ్యలో భక్తులతో ఆయన కలిసి ఆయన పాదయాత్రలో నడిచారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ జగద్గురు నరేంద్ర స్వామి జీ అడుగుజాడల్లో నడుస్తూ భక్తి మార్గంలో పాదయాత్ర విజయవంతం కావడం ఆనందకరం అన్నారు.
అందరూ ఎల్లప్పుడూ భక్తి మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు పాయ దీండీ నిర్వాహకులు, జగద్గురు నరేంద్ర చార్య మహారాజ్ స్వామీజీ భక్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగద్గురు నరేష్ నరేంద్ర చార్య మహారాజ్ స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.