కోటగిరి : ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడవాలని అమూల్గా మహారాజ్ అన్ను మహారాజ్ (Annu Maharaj) అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి(Kotagiri) మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర మందిరంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న అఖండ హరినామా సప్తాహం (Akhanda Harinama Saptaham) కార్యక్రమం శుక్రవారం ముగిసింది.
ఈ సందర్బంగా భక్తులకు మహారాజ్ ప్రవచనం చేశారు. ప్రతి ఒక్కరూ తల్లి దండ్రులను గౌరవించాలని , నిత్యం భగవంతుని నామ స్మరణ చేయలని కోరారు. అనంతరం హారతి కార్యక్రమం నిర్వహించారు. ముగింపు సందర్బంగా భక్తులకు కోటగిరి తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో అన్న దానం ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో దొండిబ మహారాజ్, కట్టు శ్రీధర్, గంగాధర్, నగేష్, అనిల్ కులకర్ణి, బొట్టే నగేష్, వడ్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.