ఏప్రిల్ 28 : ప్రజలకు సేవలు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సామాజిక సేవకర్త ఏంఎ హకీమ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోనీ వీక్లీ బజార్లో పబ్బ లాలవ్వ, సాయన్న జ్ఞాపకార్థం గోల్డెన్ జిమ్ అధ్వర్యంలో సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుతున్న ఎండల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహన దారులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించామన్నారు.
ఎండాకాలం ముగిసేంత వరకు చలివేంద్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోల్డెన్ జిమ్ ప్రొప్రైటర్ శేఖర్, బీఆర్ఎస్ నాయకుడు నవీన్, పిరజీ, జల్లపల్లి మాజీ ఎంపీటీసి రాములు, ప్రశాంత్, గంగారం, రాములు, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.