Sirikonda | సిరికొండ, జూన్ 8 : ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు సాయి ఎడ్యుకేషన్ సొసైటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశ్రాంత ఐఆర్ఎస్ జరుపుల గోవిందు, డాక్టర్ లీలా ఆధ్వర్యంలో పందిమడుగు ప్రైమరీ పాఠశాల విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకు నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయూరాలు స్వప్న, సర్పంచ్ మాలావత్ గోవింద్, మాజీ సర్పంచ్ ఎంజీ, ఉప సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు మాలావత్ రవి, మాలావత్ రాములు నాయక్, మాలావత్ గంగ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.