లింగంపేట, ఏప్రిల్ 14: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నా రు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మెంగారం గ్రామం నుంచి జీఎన్ఆర్ గార్డెన్ వరకు శుక్రవారం నిర్వహించిన బోధిసత్వ అంబేద్కర్ రథయాత్ర, బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే సురేందర్ పాల్గొన్నారు. అనంతరం జీఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే ప్రతి ఒక్కరికీ రిజర్వేషన్లు అందుతున్నాయని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దళితులు విద్యావేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. దళితులు ఆర్థికంగా ఎదగడం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమ సమాజం ఏర్పాటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆశయసాధన కోసం తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసాబేగం, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు నీరడి సంగమేశ్వర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బండి రాజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
దేశ రాజధానిలోని పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
దేశం కేసీఆర్ వైపు చూస్తున్నది..
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 14: దేశం కేసీఆర్ వైపు చూస్తున్నదని ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం నుంచి ఆత్మకూర్ గ్రామం వరకు నిర్వహించిన బైక్‌ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ అభిమానులతో కలిసి ఆయన బైక్ నడిపారు. పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. పోచారంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. కార్యక్రమంలో పోచారం సర్పంచ్ విజితారెడ్డి, ఎంపీటీసీ వినితారెడ్డి, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ కాశీ నారాయణ, మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య, ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే..
ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 14: ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఉన్న విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే సురేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తుచేశారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కోర్టు మీదుగా బస్టాండ్, గాంధీచౌక్ వద్దకు చేరుకోగానే అక్కడ పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, నాయకులు చెన్న సతీశ్, రాజు, శ్రావణ్‌కుమార్, అరవింద్‌గౌడ్, జంగం నీలకంఠం అప్ప తదితరులు పాల్గొన్నారు.