ఎల్లారెడ్డి, జూలై 10: దేశవ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తే.. మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గిరిజనుల కష్ట నష్టాలు తెలిసిన కేసీఆర్ అందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన 800 మంది గిరిజనులకు పట్టాలు, 70 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాజాల మాట్లాడుతూ.. పట్టాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు సర్వే నంబర్, పట్టా నంబర్‌తోపాటు ఇతర పట్టా పుస్తకాల్లో లేని విధంగా భూమికి సంబంధించిన మ్యాపును కూడా ఇచ్చినట్లు తెలిపారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్‌ను కేసీఆర్ ప్రభుత్వం పది శాతానికి పెంచిందని చెప్పారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మా ర్చిందని తెలిపారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ వచ్చిందన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనం, వైకుంఠ ధామం ఏర్పా టు చేసినట్లు తెలిపారు. సమైక్యపాలనలో తం డాల్లో విద్యుత్, తాగునీరు, రోడ్డు సౌకర్యం లేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో పరిస్థితి మారిందన్నా రు. ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని తెలిపారు. రాజధానిలో మూడెకరాల్లో బంజారా భవనం నిర్మించిన ఘనత కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ వెంట తాము పండరీపూర్‌కు వెళ్లామని, అక్కడ తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా లేదని, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ప డుతున్నామని అక్కడి ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ పాలన తమకూ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని అన్నారు.
అడవులను నరికితే కఠిన చర్యలు:
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
పట్టాలు తీసుకున్న వారు కానీ, ఇతరులు కానీ కొత్తగా అటవీ భూమిని నరికి వేసి సాగు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకొని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. సంత్ సేవాలాల్ మహరాజ్ చెప్పినట్లు ప్రకృతిని కాపాడు కోవాలని, ప్రకృతి బాగుంటేనే నీరు, గాలి బాగుంటుందని పేర్కొన్నారు. పోడు పట్టాలు అందిన వారికి రైతుబంధుతోపాటు రైతుబీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాశీ నారాయణ, కుడుముల సత్యం, ఉషాగౌడ్, మాధవి, శ్రీనివాస్ రెడ్డి, జలేంధర్‌రెడ్డి, ఏగుల నర్సింహులు, సాయిలు, మనోహర్ రెడ్డి, మూడు మండలాలకు చెందిన నాయకులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.